Telangana Assembly Elections | సిరిసిల్ల నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్‌కు 5329 ఓట్ల మెజార్టీ నమోదైంది.
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
Telangana Assembly Elections | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్లో బీఆర్ఎస్ 5253 ఓట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం 44218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. రెండో రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3167 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
Telangana Assembly Elections | సంగారెడ్డి జహీరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ 689 ఓట్లతో లీడింగ్‌లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుకు 4,707 ఓట్లు పోలయ్యాయి.
జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తియ్యేవరకు ఎమ్మెల్యే హన్మంతు షిండే తన సమీప అభ్యర్థి కంటే 2184 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.