Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. రెండో రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కేసీఆర్‌కు 4,583 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ పార్టీకి 2,036 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.