Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్లో బీఆర్ఎస్ 5253 ఓట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం 44218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 1171 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 2033 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సొంతూరు బొప్పాపూర్‌లో 304 ఓట్లతో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అక్కడ బీజేపీకి కేవలం 300 ఓట్లే పోలయ్యాయి.
దుబ్బాకలో 14 రౌండ్లో
బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 5253
కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డికి 1171, బీజేపీ రఘునందన్ రావు 2033
ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 44,218 ఓట్ల ఆదిక్యం.