Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ 8, ఎంఐఎం 6, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్లో ఉంది. బీజేపీ ఖాతా తెరవలేదు.
ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, గోషామహల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కారు దూసుకెళ్తోంది.