Jobs | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2027 (UPSC CGSPE 2027) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 127 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB)లలో గ్రూప్ ఎ, బి కేటగిరీ పోస్టులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు
జియాలజిస్ట్ (గ్రూప్ ఎ) 29
కెమిస్ట్ (గ్రూప్ ఎ) 7
అసిస్టెంట్ జియాలజిస్ట్ (గ్రూప్ బి) 34
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ (గ్రూప్ బి) 35
అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రూప్ బి) 6
సైంటిస్ట్ బి హైడ్రాలజీ (గ్రూప్ ఎ) 5
సైంటిస్ట్ బి కెమికల్ (గ్రూప్ ఎ) 1
సైంటిస్ట్ బి జియోఫిజిక్స్ (గ్రూప్ ఎ) 1
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ (గ్రూప్ బి) 7
అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రూప్ బి) 1
అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్(గ్రూప్ బి) 1
అర్హతలు, వయోపరిమితి
పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో (జియాలజీ, కెమిస్ట్రీ, అప్లైడ్ జియాలజీ, మెరైన్ జియాలజీ, ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఓషనోగ్రఫీ, హైడ్రోజియాలజీ, జియో ఫిజిక్స్) మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. వయసు 2027 జనవరి 1 నాటికి 21 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు 5, పీడబ్ల్యూడీలకు 10 సంవత్సరాలు వయోపరిమితి ఉంది.

Geo Scientist Posts
ఎంపిక
మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. స్టేజ్-1 ప్రిలిమ్స్. ఆబ్జెక్టివ్ టైప్ (రెండు పేపర్లు), 400 మార్కులు. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. స్టేజ్-2 మెయిన్. డిస్క్రిప్టివ్/కన్వెన్షనల్ టైప్ (మూడు పేపర్లు), 600 మార్కులు. స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ, 200 మార్కులు. దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు
ప్రిలిమ్స్.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం, చెన్నై, లక్నో, ప్రయాగ్‌రాజ్, జైపూర్, భోపాల్. మెయిన్స్.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, భోపాల్, దిస్పూర్, సిమ్లా.
ముఖ్యతేదీలు
దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 22. ప్రిలిమ్స్ 2027, జనవరి 10. మెయిన్స్ 2027, జూన్ 19, 20. ఇతర వివరాలకు వెబ్సైట్ www.upsc.gov.in చూడండి.