The Paradise | ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో రూ.20 కోట్లకు చేరువ..
The Paradise | పెద్ద సినిమాల విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో థియేట్రికల్ ట్రైలర్ది కీలక పాత్ర. కథ, హీరో పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, దర్శకుడి విజన్ వంటి అంశాలను ట్రైలర్ ద్వారా చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతారు. అయితే నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది.
The Paradise | పెద్ద సినిమాల విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో థియేట్రికల్ ట్రైలర్ది కీలక పాత్ర. కథ, హీరో పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, దర్శకుడి విజన్ వంటి అంశాలను ట్రైలర్ ద్వారా చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతారు. అయితే నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయకపోయినా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలకు ముందే టికెట్ కౌంటర్ల వద్ద ఈ సినిమా బలమైన జోరు చూపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ముందస్తు టికెట్ విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.20 కోట్ల మార్క్‌కు చేరువైనట్లు తెలుస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయిలో వసూళ్లు నమోదవుతుండటం సినిమాకు ఉన్న ముందస్తు క్రేజ్‌ను తెలియజేస్తోంది. ‘ది ప్యారడైజ్’పై అంచనాలు పెరగడానికి సినిమాలోని పాటలు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ‘యేషానాగుల’ పాట విడుదలైన తర్వాత ప్రత్యేకంగా వైరల్ అయింది. పాలమూరు జానపద బాణీకి మాస్ టచ్ జోడించడంతో ఈ పాటకు మంచి స్పందన లభించింది.
ప్రభ బంగారిగల్ల, అద్దుల జంగిరెడ్డి ఆలపించిన ఈ పాట వినాయక చవితి వేడుకల్లోనూ విస్తృతంగా వినిపించింది. దీంతో పాటకు మరింత గుర్తింపు వచ్చింది. సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో చిత్రబృందం ఈ పాటకు ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఈ పాటకు వచ్చిన స్పందనతో ‘ది ప్యారడైజ్’లో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో మరోసారి స్పష్టమైంది.ఇక జంగిరెడ్డి, అర్జున్ చండీ పాడిన ‘ఆయా షేర్’ పాట కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ పాటలోని తీవ్రత, నాని పాత్రను చూపించిన తీరు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పటివరకు విడుదలైన ఈ రెండు పాటలే సినిమాకు సంబంధించిన సంగీతంపై అంచనాలను గణనీయంగా పెంచాయి. సాధారణంగా భారీ సినిమాలకు ట్రైలర్ విడుదలైన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌లో మరింత వేగం కనిపిస్తుంది. అయితే ‘ది ప్యారడైజ్’ విషయంలో ఇప్పటివరకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకపోయినా ముందస్తు టికెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సెప్టెంబర్ 23 బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు అనుమతులు లభించాయి. దీంతో నాని అభిమానులు, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక రోజు ముందుగానే సినిమాను చూసే అవకాశం లభించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

