Sonu Sood | నేపాల్ బాధితుల సాయంపై ట్రోలింగ్.. స్పందించిన సోనూసూద్!
Sonu Sood | నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన ప్రముఖ నటుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Sonu Sood | నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన ప్రముఖ నటుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సహాయక చర్యల కోసం ఆయన నేపాల్‌లో పర్యటించడం కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, గ్రౌండ్లో పనులు ప్రారంభం కాకముందే కొందరు ఆయనను దేవుడిగా చిత్రీకరిస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నారంటూ ఒక జర్నలిస్ట్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
అయితే ఈ ట్రోలింగ్‌ను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని సోనూసూద్, చాలా కూల్‌గా స్పందించారు. ‘సోదరా.. మీ మనసు చాలా మంచిది. మీరు నేపాల్‌కు దయచేసి రండి. మన ఇద్దరం కలిసి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి సాయం చేద్దాం’ అంటూ సానుకూలంగా రిప్లై ఇచ్చారు. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, విమర్శించిన వ్యక్తినే నేరుగా సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సోనూసూద్ సంస్కారాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

