Nepal Floods: 9 రోజుల తర్వాత.. నేపాల్ టన్నెల్లో ఇద్దర్ని రక్షించిన ఆర్మీ
Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన జల ప్రళయంతో త్రిశూలీ పవర్ ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరదలు వచ్చిన 9 రోజుల తర్వాత ఇవాళ రెస్క్యూ సిబ్బంది ఇద్దర్ని సజీవంగా కాపాడారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇద్దర్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
కాట్మాండు: నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం(Nepal Floods)తో త్రిశూలీ పవర్ ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరదలు వచ్చిన 9 రోజుల తర్వాత ఇవాళ రెస్క్యూ సిబ్బంది ఇద్దర్ని సజీవంగా కాపాడారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇద్దర్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఇద్దర్నీ ఫోర్‌మెన్ సంజయ్ సాహ(30), సూపర్వైజర్ కబీర్ మహార్జన్(45)గా గుర్తించారు. సంజయ్ సాహ మట్లాడుతూ.. జల విలయం సంభవించిన సమయంలో టన్నెల్‌లోని కార్మికులను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్న సమయంలో తాను ట్రాప్ అయినట్లు పేర్కొన్నాడు. కనీసం నలుగురితో ఆ టన్నెల్లో టచ్‌లో ఉన్నట్లు అతను చెప్పాడు. నేపాల్ వరదల వల్ల సుమారు 12 హైడ్రోపవర్ ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయి. వీటిల్లో సుమారు 900 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీంట్లో ఇంజినీర్లు, సూపర్వైజర్లు కూడా ఉన్నారు. నేపాల్ ఆర్మీ నేతృత్వంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఎక్విప్మెంట్ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కొందరితో రెస్క్యూ సిబ్బంది మాట్లాడినట్లు తెలుస్తోంది.
#WATCH | Nepal | Rescue workers rescue one person from inside the tunnel of the Trishuli 3A hydel project
Video source: Secretariat of the Ministry of Energy, Water Resources and Irrigation, Govt of Nepal pic.twitter.com/tNZTMoWgIp
— ANI (@ANI) September 4, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

