రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ నెల 16, 17 తేదీల్లో సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయస్థాయి మహిళల కబడ్డీ టోర్నీ బుధవారం మొదలైంది.
వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్‌గా వ్యవహరించనున్నది.
క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నార�
బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
ఇండియన్ సూపర్‌లీగ్‌లో భాగంగా శుక్రవారం ఒడిశా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1-3 తేడాతో ఓడిపోయింది. ఇసాక్ వన్లరూఫెల 33వ నిమిషంలో ఒడిశాకు తొలి గోల్ అందించగా, విరామానికి ముందు నిమ్ దోర్జి తమ�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 200మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో రాష్ట్ర యువ స్విమ్మర్ సాయి నిహార్ 2: 12:70 సెకన్ల టైమింగ్‌తో రజతం సొంతం చేసుకున్నాడు.
మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేలా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ (160), అర్పిత్ వసవాడా (112 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేయడంతో కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర దీటుగా బదులిస్తున్నది.
జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు అనారోగ్యంతో మంచంపట్టాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన తుడుం ప్రశాంత్ కబడ్డీలో జాతీయస్థాయిలో రెండుసార్లు ఆడి విజేతగా నిలిచాడు.