ఆర్మూర్, మార్చి12: క్రీడల్లో రాణించి ఎంతో మంది క్రీడాకారులు ఉన్నత స్థానాలను అధిరోహించారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నరేంద్ర ఆల్ఫోర్స్ హైస్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి 37వ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ బాలుర క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టోర్నీలో కరీంనగర్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, ఆదిలాబాద్ జట్టు ద్వితీయ, నల్గొండ జట్టు తృతీయ, మహబూబ్‌నగర్ జిల్లా జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.
విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, కోశాధికారి రమేశ్, నిజామాబాద్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ సంఘం అడ్‌హక్ కమిటీ జిల్లా చైర్మన్ గంగామోహన్‌చక్రు, కోకన్వీనర్ రాజేశ్, కౌన్సిలర్ రవిగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ పవన్, గ్రామీణ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాశిరెడ్డి, బాల్ బాడ్మింటన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్, హాకీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, హ్యాండ్ బాల్ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు తొర్లికొండ ఇర్లభూపతి, ప్రేమ్, పేగడ నరేందర్, నిఖిత, మాధురికుమార్, తొర్లికొండ మధుయాదవ్, మంచిర్యాల సురేశ్, జక్కరాజేశ్వర్, హరీశ్, చిన్నయ్య, నాగేశ్, సంతోష్ఠాగూర్, రాజేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.