బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ ఓపెన్లో భారత ద్వయం అంకితా రైనా, ప్రార్థనా తోంబ్రె క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో అంకిత, ప్రార్థన జోడీ 5-7, 6-3, 10-6తో భారత్, జర్మనీ ద్వయం శర్మద బాలు, సారా రెబెకాపై అద్భుత విజయం సాధించింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన పోరులో యువ ప్లేయర్లు అంకిత, ప్రార్థన మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
మరోవైపు రుతుజా భోంస్లే, జాక్వెలిన్ జోడీ 6-4, 6-2తో జీ హీ చోయ్, లీ య హున్ ద్వయంపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.