బెంగళూరు: మహిళల ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ అంకితా రైనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో అంకిత 6-1, 6-1 తేడాతో భారత్‌కే చెందిన రుతుజా భోంస్లేపై అలవోక విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
మరో సెమీస్‌లో బ్రెండా ఫ్రువీర్టోవా(చెక్ రిపబ్లిక్) 7-6(2), 6-2తో దలిలా జకుపోవిచ్(స్లోవేకియా)పై గెలిచింది. ఆదివారం అంకితారైనా, బ్రెండా సింగిల్స్ తుదిపోరులో తలపడుతారు. మహిళల డబుల్స్ ఫైనల్లో జార్జ్ ఫ్రాన్సిస్కా, జార్జ్ మాటిల్డె జోడీ 5-7, 6-0, 10-3తో వాలెటినీ, ఈడెన్ సిల్వా ద్వయంపై గెలిచి టైటిల్ దక్కించుకుంది.