T20 World Cup Final | న్యూజిలాండ్, అహ్మదాబాద్.. భారత జట్టుకు ఈ రెండే విలన్..!
T20 World Cup Final : పొట్టి ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫేవరెట్ భారత జట్టే అయినప్పటికీ ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడం.. వేదికగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియ (Narendra Modi Stadium)మే అందుకు కారణం.
T20 World Cup Final : పొట్టి ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫేవరెట్ భారత జట్టే అయినప్పటికీ ప్రత్యర్ధి న్యూజిలాండ్(Newzealand) కావడం.. వేదికగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియ (Narendra Modi Stadium)మే అందుకు కారణం. అవును.. కొన్నాళ్లుగా కివీస్, మోడీ స్టేడియం టీమిండియా పాలిట విలన్‌గా మారాయి. ఐసీసీ ఈవెంట్లలో భారత్ ఇప్పటికే రెండుసార్లు బ్లాక్ క్యాప్స్ చేతిలో కంగుతిన్నది. ఇక నరేంద్ర మోడీ మైదానంలో మూడేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయింది టీమిండియా. సో.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ సేన కప్ గెలుస్తుందా? లేదంటే చేదు జ్ఞాపకాలు మళ్లీ భారత్‌ను వెంటాడుతాయా? అనేది ఆందోళన రేకిత్తిస్తోంది.
డిఫెండింగ్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరడంతో భారత అభిమానులు పొంగిపోయారు. జాకబ్ బెథెల్ విధ్వసంక సెంచరీ చేసినా.. 7 పరుగులతో సూర్యకుమార్ సేన గెలిచింది. ఇంకేముంది ఇంకొక్క అడుగే.. ట్రోఫీ మనదే అని సంబురాలు చేసుకున్నారు. అయితే.. టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో, ఆడాల్సింది న్యూజిలాండ్‌తో అని తెలియగానే కాస్త కంగారు మొదలైంది. ఎందుకంటే.. ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు పాలిట న్యూజిలాండ్ విలన్ పాత్రను పోషిస్తోంది.
A fourth final against India – can New Zealand pull off something special? pic.twitter.com/kMrRnil8C2
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2026
New Zealand don’t want to be the nice guys in Ahmedabad 😁 pic.twitter.com/qdYTUtqOek
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2026
ఇప్పటివరకూ టీమిండియా – కివీస్ మూడు ఫైనల్లో తలపడ్డాయి. 2-1తో బ్లాక్ క్యాప్స్ ఆధిపత్యం చెలాయించింది. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది న్యూజిలాండ్. అనంతరం.. 2021లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సేనకు షాకిస్తూ ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు కొల్లగొట్టింది. అయితే.. ఈరెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్‌ను 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది.
Opportunity for a hat-trick of white-ball titles 🇮🇳 pic.twitter.com/w9ocgcS4kw
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2026
ఇప్పుడు.. టీ20 వరల్డ్‌కప్‌తో ఇరుజట్లు నాలుగోసారి ఐసీసీ ఫైనల్ ఆడబోతున్నాయి. పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఫిన్ అలెన్ సునామీ సెంచరీతో గెలుపొందిన మిచెల్ శాంట్నర్ సేన.. ఫైనల్లో ఫేవరెట్ భారత్‌కు గుబులు రేపుతోంది. ఆఫ్ స్పిన్నర్లను ఆడలేకపోతున్న భారత టాపార్డర్‌ను కూల్చేందుకు ఆ జట్టు సిద్ధమవుతోంది. అయితే.. అందుకే కాబోలు.. మీడియా సమావేశంలో కివీస్ సారథి సొంత ప్రేక్షకులను నిశబ్దంగా మారుస్తాం. మేము ఒక్క ట్రోఫీ గెలవడానికి కొన్ని హృదయాలను ముక్కలు చేసినా బాధ పడను అని విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. కానీ.. భారత కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం.. ప్రతిఒక్కరూ ఇలానే మాట్లాడుతారు. కొత్తగా ప్రయత్నిస్తే మంచిది అని తేలికగా కొట్టిపారేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

