Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ కాన్వాయ్ ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన యువకుడు అంకన్న (25) గా గుర్తించారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సీఎం పర్యటించే మార్గంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పోలీసులు, ఉన్నతాధికారులు ఆదివారం మధ్యాహ్నం కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ వ్యాన్ రాంగ్రూట్లో అత్యంత వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యాన్ రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించిందని.. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న అంకన్నను ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాద ధాటికి అంకన్న గాల్లోకి ఎగిరి కింద పడటంతో తలకు బలంగా దెబ్బలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.