హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉడుపి(కర్ణాటక) వేదికగా జరుగుతున్న 18వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యార్థి అవుట అఖిల పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల అండర్-18 1500మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన అఖిల 4ని.45.31సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది.
సెజాల్బెన్ బాబుబాయి కతర్ (4ని.47.75సె), ముస్కాన్ (4ని.53.88సె) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో స్వర్ణ పతకం గెలువడం ద్వారా అఖిల.. తాష్కెంట్(ఉజ్బెకిస్థాన్) వేదికగా జరుగనున్న యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించింది.