హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడాకారులను సమాజం ప్రోత్సహించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బీ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం సాట్స్ కార్యాలయాన్ని సందర్శించిన వినోద్‌కుమార్..సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ను ఆయన సత్కరించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మాట్లాడుతూ ‘క్రీడాభివృద్ధి అనేది ప్రభుత్వ బాధ్యత కాకుండా సమాజంలోని అన్ని వర్గాలు వారు ఆదరించడం, ప్రోత్సహించడం వల్ల మరింత మంది ప్లేయర్లు వెలుగులోకి వస్తారు.
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వ శాఖలు సమనయ్వంతో పనిచేయాలి. ప్రైవేట్ సంస్థలు కూడా క్రీడాభివృద్ధికి ముందుకు రావాలి. ప్లేయర్లకు ప్రైవేట్ సంస్థలు ఉపాధి కల్పించేందుకు సాట్స్ వారధిలాగా పనిచేయాలి. ఆరోగ్యవంతమైన సమాజానికి క్రీడలు ప్రధానం’ అని అన్నారు. చైర్మన్‌గా పదవి చేపట్టిన రెండు నెలల్లోనే వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ను వినోద్‌కుమార్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోతెలంగాణ ప్లేయర్లు మరిన్ని పతకాలు సాధించేలా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు.