ఇల్లెందు, మార్చి 10 : పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద జరిగే గ్యాస్ ప్రమాదాలు, ఇతర అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని ఇల్లెందు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి రామారావు అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణం జేబీఎస్ హైస్కూల్ విద్యార్థులకు వేసవికాలంలో జరుగు అగ్ని ప్రమాదాలపై, ఇంట్లో గ్యాస్ తదితర ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రయోగపూర్వకంగా మంటలు ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లలిత, వార్డ్ కౌన్సిలర్ అజ్మీర వంశీ, పాఠశాల సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.