బూర్గంపహాడ్, ఆగస్టు 03 : భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన దిగవంత సున్నం రాజయ్య ఆదివాసీలకు ఎనలేని సేవ చేశారని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి అన్నారు. సోమవారం సారపాకలో సున్నం రాజయ్యతో పాటు ఆయన మరణించిన రోజే సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య, గుండంగట్టు అప్పారావు మృతిచెందారని వారి చిత్రపటాలకు కూడా నివాళులర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా సున్నం రాజయ్య పలుమార్లు పదవి చేపట్టారని, ఆ సమయంలో ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజిని, ఎస్.అబిద, కనకం వెంకటేశ్వర్లు, షహిదా, శాఖమూరి నర్సింహారావు పాల్గొన్నారు.