గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు
గంజాయి అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిని ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సరిత సోమవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలిలా ఉన్నాయి. 2020 మార్చి 22న బూర్గంపహాడ్ అప్పటి ఎస్ఐ బాలకృష్ణ...
బూర్గంపహాడ్, ఆగస్టు 03 : గంజాయి అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిని ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సరిత సోమవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలిలా ఉన్నాయి. 2020 మార్చి 22న బూర్గంపహాడ్ అప్పటి ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి భారత్ బంద్ సందర్భంగా సారపాక బస్టాండ్ సెంటర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హోండా స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను నిలిపి తనిఖీ చేయగా వారి వద్ద 20 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులను మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన బీమనపల్లి శ్రీనివాసులు, రావిరాల లక్ష్మినారాయణగా గుర్తించి అప్పటి ఏఎస్ఐ సోమేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి సీఐలు నవీన్, సత్యనారాయణ దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో కోర్టు ఏడుగురు సాక్షులను విచారించి ఇద్దరు నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో ఐదేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫణికుమార్ వాదనలు వినిపించగా కోర్టు నోడల్ అధికారి రాఘవయ్య, కోర్టు లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సీపీ అక్రమ్ కేసు విచారణలో సమన్వయం చేసి సహకరించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

