తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 23 మంది కవుల ఆత్మ కథనాత్మక కవిత్వ సంకలనం వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు 25 ఏండ్లు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో స్పృహ సాహితీ సంస్థ, బీసీ రచయితల స మాఖ్య ఆధ్వర్యంలో రజతోత్సవ సభ నిర్వహించనున్నది. సెప్టెంబర్ 20న ఆదివారం ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞా న కేంద్రంలోని అనిశెట్టి రజిత ప్రాంగణంలో సభ జరగనుంది.
బాలచెలిమి కథల పోటీ-2026
విద్యార్థిని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వారి రచనా ప్రతిభను ప్రోత్సహించేందుకు నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ‘ కథల పోటీ2026’ నిర్వహిస్తున్నది. ప్రతిభావంతులైన బాల రచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని బాలచెలిమి గరిపెల్లి అశోక్ కన్వీనర్ తెలిపారు. అక్టోబర్ 14వ తేదీలోపు అందిన కథలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు desk.chelimi @gmail.com, వాట్సాప్ నంబర్ 86866 64949కు సంప్రదించాలని సూచించారు.
20న గడియారం సాహిత్య పురస్కారం
శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం సౌజన్యంతో ఎంవీఆర్ ఫౌండేషన్ నిర్వహణలో కడప రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి డా.గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కార ప్రదాన సభ ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు డా.గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, వక్తలు పాల్గొంటారు.