KTR | కొచ్చిలోని గ్రాండ్ హయత్‌లో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2026లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి కేటీఆర్ మాట్లాడారు. మీరు ప్రధాన రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి.. అని యాంకర్ అంటే కేటీఆర్ బదులిస్తూ కచ్చితంగా కాదన్నారు. ఎందుకో చెప్తా. మీకు ఆర్ఆర్ఆర్ తెలుసనుకుంటా.. Recall, Regret, Revolt.. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎన్నో తప్పుడు వాగ్ధానాలు ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా ఉండే కార్డులు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు వాళ్లు 420 హామీలు ఇచ్చారు. బంగారం, స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2500 సహా 420 హామీలు ఇచ్చారు. మేం కేవలం 1.8 శాతంతో అధికారం కోల్పోయాం. రూ.4 లక్షల ఓట్ల అతి తక్కువ తేడాతో కోల్పోయామన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ వీధుల్లో తిరుగుబాటు వస్తది. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ సీఎం అవడం మీరు చూస్తారని హామీ ఇస్తున్నా.. కేసీఆర్ సీఎంగా ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు కేటీఆర్.
రెండేళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు
కాంగ్రెస్ పాలనతో విసుగు చెంది ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు
ముఖ్యమంత్రి అయ్యేది నేను కాదు కేసీఆర్ గారు
– కేటీఆర్ https://t.co/jGAxlME6NU pic.twitter.com/2nyE7gWr6H
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!