భారత షూటర్ విజయ్‌వీర్ సిద్ధు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో రజత పతకం సాధించడం ద్వారా విజయ్‌వీర్ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.
Mary Kom: యువ బాక్సర్లు ఒక్క ఛాంపియన్షిప్ గెలవగానే దానితోనే సరిపెట్టుకుంటున్నారని, తానైతే నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ మరో రెండుమూడేండ్ల పాటు ఆడాలని అనుకుంటున్నానని...
IND vs ENG | ఈ నెలఖరులో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. తమ వెంట ప్రత్యేక వంటవాళ్లను తెచ్చుకోనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కావడంతో.. భారత్‌లో ఏడు వారాలకు పైగా ఉండాల్సి రావడంతో టీమ్‌తో పాటు చ�
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా మధ్య జూన్ 1న జరగనున్న మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన�
పాకిస్థాన్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.
అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో తెలుగు యోధాస్(18) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో యోధాస్ 38-30తేడాతో చెన్నై క్విక్గన్స్పై అద్భుత విజయం సాధించింది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగిస్తున్నది.
దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. టీ20 సిరీస్‌ను ‘డ్రా’ చేసుకొని.. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్‌ను సమం చేసుకునేందుకు సమాయత్తమైంది.
క్రొయేషియా వేదికగా జరిగే జాగ్రెబ్ ఓపెన్ కోసం అడ్హాక్ కమిటీ 13 మంది రెజ్లర్లను మంగళవారం ప్రకటించింది. అయితే స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, అంతిమ్ పంగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగబోతున్నది.
సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్‌ఇండ
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గతేడాది చాలా టోర్నీలకు దూరమైన నాదల్ వచ్చి రావడంతోనే సత్తాచాటాడు.
రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి సాంఘిక సంక్షేమ గురుకుల యువ అథ్లెట్ కీర్తన ఎంపికైంది.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది.
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ ఫుట్‌బాల్ జట్టుకు సయ్యద్ ఇంతియాజ్ సారథిగా వ్యవహరించనున్నాడు.