రోమ్: ఇటాలియన్ ఓపెన్‌లో ఆడుతున్న టాప్ సీడ్ నొ వాక్ జొకోవిచ్ తలకు స్వల్ప గాయమైంది. ఈ టోర్నీ తొలి రౌం డ్లో జొకో.. 6-3, 6-1 తేడాతో కొ రెంటిన్ (ఫ్రెంచ్) ను ఓడించిన అనంతరం గ్యాలరీలో ఉన్న ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు వెళ్లాడు.
ఇదే సమయంలో సదరు అభిమాని బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ ప్రమాదవశాత్తూ జొకో తలకు బలంగా తగలడంతో అతడు అక్కడే కూలబడిపోయాడు. ఇక మ్యాచ్ ముగిశాక బయటకు వచ్చిన జొకో తలకు హెల్మెట్‌తో రావడం గమనార్హం.