Sunil Chhetri : భారత్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ఛెత్రి ప్రకటించారు. వచ్చే నెల 6న కోల్‌కతాలో కువైట్‌తో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ అర్హత మ్యాచ్చే తనకు ఆఖరి మ్యాచ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సునీల్ ఛెత్రి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియోను పోస్టు చేశారు.
సునీల్ ఛెత్రి తన 20 ఏళ్ల కెరీర్లో భారత్ తరఫున 145 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ మొత్తంలో 93 గోల్స్ సాధించాడు. సునీల్ ఛెత్రి పోస్టు చేసిన 9.51 నిమిషాల నిడివిగల ఎమోషన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. తన వీడియోకు ఛెత్రి ‘ఐ ఉడ్ లైక్ టు సే సమ్‌థింగ్’ అనే క్యాప్షన్‌ను జతచేశాడు. సునీల్ ఛెత్రి ఏం చెప్పాడో కింది వీడియోలో మీరు చూడొచ్చు.
I’d like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024