John Klinger : జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ క్లింగర్ (బ్యాడ్ బోన్స్) హఠాన్మరణం చెందారు. జర్మనీకి చెందిన రెజ్లింగ్ బోర్డు wXw తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హఠాన్మరణం చెందిన జాన్ క్లింగర్కు కన్నీటి వీడ్కోలు’ అని పేర్కొన్నది. అయితే క్లింగర్ హఠాన్మరణానికి గల కారణం ఏమిటనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
జాన్ క్లింగర్ 2000 సంవత్సరలో తన 16వ ఏట wXw తో ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ను ప్రారంభించారు. 2004 నుంచి అమెరికా, యూరప్, జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రెజ్లింగ్ ఆడారు. తన కెరీర్లో ఇప్పటివరకు క్లింగర్ 450 మ్యాచ్లు ఆడినట్లు wXw తెలిపింది. కేవలం 40 ఏళ్ల వయస్సులోనే క్లింగర్ మరణించడం విషాదకరమని పేర్కొంది.
క్లింగర్ తన చివరి మ్యాచ్ను మే 11న మోర్గాన్ వెబ్స్టర్తో ఆడాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో తన రిటైర్మెంట్కు కూడా క్లింగర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.