వేములవాడ రాజన్న ఆలయంలోని పలు ఉద్యోగాలకు మంగళవారం నియామక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకానికి కమిటీని నియమిస్తూ జీవోను ఉత్తరాలు జారీ చేశారు.
జగిత్యాల రూరల్ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన శ్రీలత (20) సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ (55) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్�
తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు.
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ (బీఆర్ఎస్) హఠాన్మరణం చెందింది. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చేర్పించగా, అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది.
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన బూస గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బాధిత కుటుంబానికి ఆదివారం బాల్యమిత్రులు కలిసి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు.
తాటి చెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు కథనం ప్రకారం.. చందుర్తి మండలం మూడపెల్లి గ్రామానికి చెందిన వట్టిమల్ల రవి గురువారం సాయంత్రం తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతు�
చందుర్తి మండలం మర్రిగడ్డ పల్లె దవాఖానాలో మౌలిక వసతులు కరువయ్యాయి. నిత్యం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ అందుబాటులో ఉండే పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది.