T20 World Cup Final | వరల్డ్‌కప్ ఫైనల్ కోసం ప్రత్యేక పిచ్.. భారత్‌కు అహ్మదాబాద్ కలిసొచ్చేనా..!
T20 World Cup Final : ఉత్కంఠ రేపుతున్న ఫైనల్ కోసం క్యురేటర్ ప్రత్యేకమైన పిచ్ సిద్ధం చేశారు. అయితే.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి ఫలితం మన జట్టుకు అనుకూలంగా వస్తుందా? లేదా.. అనేది అభిమానుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
T20 World Cup Final : ఐసీసీ పురుషుల పొట్టి వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఒక్క రోజే ఉంది. సెమీఫైనల్లో అద్భుత విజయాలతో ఔరా అనిపించిన భారత్, న్యూజిలాండ్ టైటిల్ ఫైట్‌కు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో ఆదివారం రాత్రి 7:00 గంటలకు టీమిండియా, కివీస్ మధ్య టైటిల్ యుద్ధం ప్రారంభమవుతుంది. ఫైనల్ కోసం క్యురేటర్ ప్రత్యేకమైన పిచ్ సిద్ధం చేశారు. అయితే.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి ఫలితం మన జట్టుకు అనుకూలంగా వస్తుందా? లేదా.. అనేది అభిమానుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
టీ20 వరల్డ్‌కప్ బిగ్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్ ఫైట్‌కు ఎలాంటి పిచ్ ఉపయోగిస్తారు? బ్యాటర్లకు అనుకూలిస్తుందా? బౌలర్లకు లాభిస్తుందా? అనే చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపత్యంలో ఫైనల్ మ్యాచ్ కోసం క్యురేటర్ భగీర థాకుర్ మిశ్రమ పిచ్ (Mixed Soil Pitch)ను తయారు చేస్తున్నారు. అంటే.. ఎరుపు.. నలుపు.. మట్టి కలగలిసి ఉండే పిచ్ అన్నమాట.
The T20 World Cup final between India and New Zealand in Ahmedabad is set to be played on a similar-natured pitch to the one used in the semi-final in Mumbai pic.twitter.com/mA4QWSnTfu
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2026
ఇందులో ఎర్రమన్ను శాతం ఎక్కువగా.. నల్ల మట్టి తక్కువగా ఉంటాయి. ఈ పిచ్ టర్న్ బాగా అవుతుంది. అలానే బౌన్స్ కూడా లభిస్తుంది. మిక్స్డ్ పిచ్ స్పిన్నర్లకు అధికంగా పిచ్ లాభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాంఖడే క్యూరేటర్ మిశ్రమ పిచ్‌నే రూపొందించారు. సో.. సూర్యకుమార్ యాదవ్ సేనకు అహ్మదాబాద్‌లో పిచ్‌తో పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
అప్పుడలా.. ఇప్పుడెలానో
ఇటీవల కాలంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్ద పీట వేస్తోంది. మూడేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పాటు.. పొట్టి ప్రపంచకప్ టైటిల్ పోరుకు సైతం ఈ మైదానమే వేదిక కానుంది. అయితే.. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడి ట్రోఫీని వదలుకుంది.
ట్రావిస్ హెడ్(137)

లీగ్ దశనుంచి ఓటమెరుగని రోహిత్ శర్మ సేన అనూహ్యంగా ఫైనల్లో తడబడింది. టాస్ ఓడిన భారత్ భారత జట్టు 240 పరుగులకే ఆలౌటవ్వగా.. ఛేదనలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) విధ్వంసక సెంచరీతో గర్జించి ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. దాంతో.. వాంఖడేలో ఫైనల్ ఆడించి ఉంటే భారత్ గెలిచేది అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే అనేసరికి.. అయ్యో.. మనకు కలిసొస్తుందా? అని అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

