సిరిసిల్ల రూరల్, నవంబర్ 14: సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘ నేతలు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తంగళ్ళపల్లి మండలం మండపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో దండి లావణ్య అనే మహిళ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. లావణ్య భర్త శ్రీనివాస్ గతంలోనే మృతి చెందాడు. తల్లిదండ్రుల మృతుతో వారి కూతుర్లు శివాని, శ్రావణిలు అనాథలుగా మారారు. కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్తోమత లేకపోవడంతో దాతల సహాయంతో నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ స్పందించారు. కేసీఆర్ నగర్‌కు, వారిని పరామర్శించారు. తక్షణమే రూ. 10 వేలను చిన్నారులకు అందజేశారు. చిన్నారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. వీరి వెంట ఉపాధ్యక్షులు డాక్టర్ బాలయ్య ,మోర రవీందర్, సంఘం డైరెక్టర్స్ పాల్గొన్నారు.