Woman protests | వీర్నపల్లి , నవంబర్ 22 : ఆర్టీసీ బస్సును అపలేదని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రంగంపేటకు చెందిన సంతోష సిరిసిల్ల వెళ్లడానికి బస్టాండ్ లో వేచి ఉంది. వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు అప్పటికే గ్రామం దాటిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తన సోదరుడితో కలిసి బైక్ పై రెండు కిలోమీటర్లు బస్సును వెంబడించింది.
వీర్నపల్లి అటవీ కార్యాలయం ముందు బస్సును అడ్డగించింది. బస్సు ఎందుకు అపలేవని డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది. సుమారు అర్థగంట పాటు ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఐ లక్ష్మణ్ అక్కడికి చేరుకుని ఇరువురితో మాట్లాడారు. బస్సు ను అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.