Medical check-up | రుద్రంగి, నవంబర్ 20: రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించినట్లు తెలిపారు.
పోషక విలువలు కలిగిన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి మంకు వనిత, ఎంఎలెచ్పీ అర్చన, ఎఎన్ఎం విజయ, ఆశా కార్యకర్తలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.