Sarangapur | సారంగాపూర్, నవంబర్ 10 : సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అలాగే మండలంలోని రేచపల్లి గ్రామంలో ఎంపీడీవో, ఎంపీవో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో పొడారపు గంగాధర్, ఎంపీవో సలీం, ఏపీవో శ్రీలత, ఏఈ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.