Tanikella bharani | ఫేక్ న్యూస్‌పై తనికెళ్ల భరణి ఆగ్రహం .. నా ఆస్తుల స్టోరీలు చూసి నేనే షాక్ అయ్యాను
Tanikella bharani | డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఫేక్ న్యూస్ సమస్య కూడా తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నిర్ధారణ లేని కథనాలు సృష్టించి వైరల్ చేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. కేవలం వ్యూస్ కోసం సంచలనాత్మక థంబ్‌నెయిల్స్ పెట్టి, ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tanikella bharani | డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఫేక్ న్యూస్ సమస్య కూడా తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నిర్ధారణ లేని కథనాలు సృష్టించి వైరల్ చేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది. కేవలం వ్యూస్ కోసం సంచలనాత్మక థంబ్‌నెయిల్స్ పెట్టి, ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్తులు, వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్‌లో పలు తప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన ఇంటి ముందు అరడజను ఖరీదైన కార్లు నిలిపి ఉన్నాయని, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి వీడియో ద్వారా స్పందించారు. ఇటీవల నా ఆస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు. కానీ ఆ వార్తలు చూసి నేనే షాక్ అయ్యాను అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన ఇంటి ముందు ఖరీదైన కార్లు ఉన్నాయంటూ చూపిస్తున్న వీడియోల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ వార్తలు చూసి తాను, తన కుటుంబ సభ్యులు కలిసి నవ్వుకున్నామని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాను ఏదో ఒక దేశం లేదా మతానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరగడాన్ని కూడా ఆయన ఖండించారు. నేను అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తాను. ఎవరినీ బాధపెట్టేలా నేను ఎప్పుడూ మాట్లాడను అని స్పష్టంగా తెలిపారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు తనను నమ్మే మిత్రులు, శ్రేయోభిలాషులను బాధకు గురిచేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నమ్మకూడదని, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు. తనికెళ్ల భరణి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు ఆయనకు మద్దతుగా స్పందిస్తూ ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆగాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8
— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

