అసంపూర్తిగా..
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టి న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. వెజ్, నాన్‌వెజ్ అన్నీ ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం జిల్లా కేంద్రం నడిబొడ్డున పాత వ్యవసాయ మార్కెట్ స్థలంలో కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
- నాగర్‌కర్నూల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు
- పనులు పూర్తి చేయని కాంగ్రెస్ పాలకులు
- ఇరకాటంగా ఉన్నా రైతు బజారులోనేకొనసాగుతున్న క్రయవిక్రయాలు
- ఎండావానలకు వ్యాపారులు, ప్రజల అవస్థలు
- క్రెడిట్ బీఆర్ఎస్కు దక్కుతుందని పనులపై నిర్లక్ష్యం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 16 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టి న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. వెజ్, నాన్‌వెజ్ అన్నీ ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం జిల్లా కేంద్రం నడిబొడ్డున పాత వ్యవసాయ మార్కెట్ స్థలంలో కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
ఆధునిక సౌకర్యాలతో రైతు బజా ర్, హోల్‌సెల్ మార్కెట్, మాంసం, చేపల విక్రయానికి అనువుగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించి నిర్మాణం చేపట్టింది. విశాలమైన స్థలంలో రైతులకు, మార్కెట్‌కు వచ్చే ప్రజలకు అనువుగా ఉండేలా మరుగుదొడ్లు, విశాలమైన దుకాణాల సముదాయం, ఆకు, కాయగూర లు, మాంసం విక్రయాలకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో నిర్మాణ పనులు నిర్వహించారు. దాదాపు 70శాతం పనులు పూర్తి కావస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో రావడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మా ణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ అసంపూర్తిగా మిగిలిన మార్కెట్ గురించి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు, ప్రజలకు సౌకర్యవంతంగా చేయాల్సింది పోయి దానిపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేశారన్న ఆరోపణలు వస్తున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణం మన ప్రభుత్వంలో చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ వారికే దక్కుతుందన్న అక్కసుతోనే నిర్మాణం పూర్తి చేసే విషయంలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇరుకుగా ఉన్న రైతు మార్కెట్లో ఒకేచోట వెజిటేబుల్స్తోపాటు చేపల విక్రయాలు చేయాల్సి రావడం, రైతు పండించిన పంటను నేరుగా రైతు బజార్‌కు తెచ్చి విక్రయించుకునేందుకు స్థల సమస్యల ఉండడంతో కమీషన్ దారులకు ఆకు, కాయగూరలను కాంటా చేసి వెళ్తున్నారు. పండించిన పంటలను విక్రయించుకునేందుకు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు లేకపోలేదు. ఈ సమస్యలన్నింటిని గుర్తించి అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విశాలమైన నూతన మా ర్కెట్ నిర్మాణమే సరైనదని గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కానీ కుళ్లు రాజకీయాలతోనే కాంగ్రెస్ సర్కార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పాత మార్కెట్లో వా రాంతపు సంత అయిన శుక్రవారం వివిధ గ్రా మాల నుంచి రైతులు, వ్యాపారులు సరైన స్థలం లేక రోడ్లపైనే కూరగాయాలు విక్రయిస్తుండడంతో కొనుగోలు కోసం వచ్చి న ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నా రు. తైబజార్ ఉండికూడా ఎం డకు ఎండుతూ వానకు తడుస్తూ కూరగాయాలు విక్రయించుకోవాల్సి వ స్తుంది. కొందరు మార్కెట్లో స్థలం లేక రోడ్లపై ఉన్న దుకాణాలను తీసుకొని అద్దె చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయ న్న ఆరోపణలు వస్తున్నాయి.
చాలా గ్రామా ల నుంచి రైతులు తాము పండించిన పంట ను మార్కెట్‌కు తెచ్చి వేలం వసతి లేక తక్కు వ ధరలకు అక్కడ ఉన్న కమీషన్ ఏజెంట్ల వద్ద కూరగాయలు వేసిపోతున్నారు. ఇరుకుగా ఉ న్న ఈ మార్కెట్ వల్ల వారాంతపు సం తరోజే కాకుండా మిగతా రోజుల్లో ప్రతిరోజూ ఉద యం 7నుంచి 10, సాయంత్రం 4 నుం చి 7 గంటల వరకు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.ఎన్నికల ముం దు చెప్పిన గొప్పలు ఇప్పుడెందుకు గుర్తుకురావడం లేదని వ్యాపారులు బ హిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమై నా అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వెంటనే పూర్తి చేసి రై తులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచాల్సిన బా ధ్య త నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ పాలకులపై ఉంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

