గజ్వేల్, ఆగస్టు 16: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో ఈనెల 18, 19న రెండు రోజలు పాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు డీన్ ప్రవీణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సదస్సులో వాతావరణ మార్పులకు అనుగుణమైన అగ్రోఫారెస్ట్రీ, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, ఆధునిక సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గిరిజన పరిజ్ఞానం, జీవ ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన విలువ శ్రేణులు వంటి అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు పంచుకుంటారని తెలిపారు. ఈ సదస్సులో ఇక్రిశాట్, నాబార్డు, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాయాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.