‘చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం’
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం ఏరియా...
– వీరనారి ఆశయాలను కొనసాగించాలి
– ఏరియా జీఎం సి.హెచ్.వెంకటరమణ
రుద్రంపూర్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సామాజిక వివక్ష, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని అన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎం. గోవిందరావు, డీజీఎం సివిల్ రాజేంద్రకుమార్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ జక్కుల గట్టయ్య, ఐఎన్టీయూసీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రజాక్తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

