బూర్గంపహాడ్, సెప్టెంబర్ 26 : బూర్గంపహాడ్‌లో గత కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈర్ల నాగేశ్వరరావుకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ ఆటో యూనియన్ సభ్యులు మానవతా దృక్పథంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు రూ.45 వేల ఆర్ధిక సాయం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సాధిక్‌పాషా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో సంఘం ఉపాధ్యక్షుడు అన్వర్‌పాషా, ప్రధాన కార్యదర్శి పెద్ద యాకూబ్, సహాయ కార్యదర్శి కేసుపాక సంపత్, చిప్ప సాయి, నిఖిల్, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.