Chakali Ailamma | ఐలమ్మ స్పూర్తితో నేటి తరానికి ఆదర్శనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Chakali Ailamma | భూస్వాములను ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్ నగర్ : భూస్వాములను ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మ (Chakali Ailamma) పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని ( Inspiration ) మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud ) అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం పద్మావతీ కాలనీలోని గ్రీన్ బెల్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు భూములు ఇవ్వాలని దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు వెళ్లాలని సూచించారు. సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారన్నారు.

చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారింకగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు సరస్వతి, సీనియర్ నాయకులు కుర్వ శ్రీశైలం, నరేందర్ , క్రాంతి , శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, ఆంజనేయులు, రవికిషన్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, కోట్ల నర్సింహా , అహ్మదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

