Israel Strikes : ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఇరాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైన, పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన విరుచుకుపడుతోంది. నాలుగో రోజైన మంగళవారం పరిస్థితి భీకరంగా మారింది. ఇరాన్ సైన్యం కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడుల మోతమోగిస్తున్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనంపైన, ఆ దేశ మిలిటరీ శిక్షణ కేంద్రంపైన, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యాలయంపైన దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 787 మంది ఇరానీలు మరణించారు. ఇంకా తీవ్రంగా దాడులు కొనసాగుతున్నాయి. దాంతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.