న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో జరుగుతున్న సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ తమ విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిరసన ప్రదర్శల్లో స్టూడెంట్స్ పాల్గోవద్దు అని ఢిల్లీ వర్సిటీ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను అమలు చేస్తున్న విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారని రాహుల్ అన్నారు. సమయం వచ్చినప్పుడు దీనికి మీరే బాధ్యులు అవుతారని ఆయన వర్సిటీకి హెచ్చరిక చేశారు. జంతర్ మంతర్‌లో జరిగే నిరసన ప్రదర్శనకు వెళ్లవద్దు అంటూ ఢిల్లీ వర్సిటీ విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇలాంటి నిరసనల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతుందని వర్సిటీ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. నకిలీ, తప్పుడు కాంటెంట్‌ను సర్క్యూలేట్ చేస్తుంటారని, దీని వల్ల విద్యార్థులకు సమస్యలు రావొచ్చు అని వర్సిటీ తెలిపింది. ఢిల్లీ వర్సిటీ ఆదేశాలను లోక్‌సభ ఎంపీ దీపేంద్ర సింగ్ హూడా వ్యతిరేకించారు.
How dare you threaten students for exercising their democratic rights?
Please note, you are the ones that will be held accountable when the time comes. https://t.co/Mx6D19SP5h
— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2026