కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 7 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బుధవారం గులాబీ కండువాలు కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధికి బాటపడిందని గుర్తుచేశారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో పండు సుమిత్, కందుకూరి శివకుమార్, శాంబోరి శ్యామ్, నునావత్ శేఖర్, వడ్డూరి ప్రశాంత్, మెదిరి వామన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.