హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని ఉపాధ్యాయులు, అధికారులను ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రవి గుగులోత్ ఆదేశించారు. సొసైటీ జోనల్ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్య, పరిపాలన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం కార్యదర్శి రవి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు.