హైదరాబాద్ : నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపటిన నిరసనకు వేలాది మంది తరలివచ్చారు. విద్యార్థుల ఉద్యమంపై తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ..మాకు ఫండింగ్ రావడం కాదు.. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ డబ్బులు ఇచ్చి మాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తోందని మండిపడ్డారు. బీజేపీ వాళ్ల దగ్గర సమాధానం లేకనే యాంటీ నేషనల్ అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా కేంద్రం దగ్గర డబ్బులు తీసుకుని మౌనంగా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది.
మన మంత్రులు ఎవరూ చదువుకోలేదు కాబట్టి చదువుకున్న మా బాధ అర్థం కాదు
మాకు ఫండింగ్ రావడం కాదు.. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ డబ్బులు ఇచ్చి మాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తోంది
బీజేపీ వాళ్ల దగ్గర సమాధానం లేకనే యాంటీ నేషనల్ అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు
మెయిన్… https://t.co/XT8pX4Coyo pic.twitter.com/1zbr9BSBoy
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026