Hanging | వీర్నపల్లి , నవంబర్ 3 : నలబై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వీర్నపల్లి మండల కంచర్లకు చెందిన దేవోల్ల హన్మాంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన హన్మంతు మృతిచెందడంతో అతడి భార్య సుమలతకు కుటుంబ పోషణ భారంగా మారింది.
దీంతో కలత చెందిన సుమలత ఇంట్లో ఎవరూ లేని సమయంతో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చిన్న కూతురి పాఠశాల నుంచి వచ్చే వరకు తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలు తీసి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. కాగా చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఇందు, లాస్య ఉన్నారు.