SSC Exams | నేటి నుంచి పది పరీక్షలు.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి!
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి.
SSC Exams | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. ఐదు నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు. గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 2,676 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఆన్స ర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేస్తామని అధికారులు హెచ్చరించారు.
గవర్నర్ శుభాకాంక్షలు..
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా జ్ఞానం, ప్రతిభను చూపించే అవకాశంగా భావించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

