Bhupalapally MLA | జయశంకర్ భూపాలపల్లి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లి ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఓ దళిత యువతిని ప్రేమపేరుతో మోసం చేశాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. హనుమకొండలో పరిచయమైన చిట్యాల మండలానికి చెందిన ఓ దళిత అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చాలాకాలంగా ప్రేమించుకోవడంతోపాటు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఓ పోలీస్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెండ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత అమ్మాయి కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌పై చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద మనుషుల పంచాయితీలో సైతం శ్రీనివాస్ అమ్మాయితో పెండ్లికి నిరాకరించాడు. దీంతో అతడిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు అమ్మాయిని మోసం చేసిన కేసులో రిమాండ్‌కు పంపినట్టు చిట్యాల సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు.