Vijay Sethupathi | ప్రకృతి కోసం పోరాడే ‘కాట్టాన్’.. విజయ్ సేతుపతి కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయిందిగా!
Vijay Sethupathi | తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సర్వైవల్ థ్రిల్లర్ 'కాట్టాన్' (Kaattaan). ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో మార్చి 27న నేరుగా రాబోతున్న ఈ చిత్రం నుంచి చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Vijay Sethupathi | తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సర్వైవల్ థ్రిల్లర్ ‘కాట్టాన్’ (Kaattaan). ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో మార్చి 27న నేరుగా రాబోతున్న ఈ చిత్రం నుంచి చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ అటవీ నివాసిగా, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రకృతిని కాపాడుకోవడానికి, అడవిపై ఆధారపడి జీవించే మనుషుల హక్కుల కోసం ఒక వ్యక్తి చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని తెలుస్తుంది. ట్రైలర్లో చూపించిన అద్భుతమైన విజువల్స్, అడవిలోని లోతైన ప్రాంతాల చిత్రీకరణ సినిమాటోగ్రఫీ స్థాయిని తెలియజేస్తుండగా, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మణికందన్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు బీ. అజిత్ కుమార్ అనే దర్శకుడితో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

