రైతులకు తెలియకుండా, ఫోర్జరీ సంతకాలతో వారి పేరిట సహకార సంఘం సిబ్బందే రుణాలు తీసుకున్న వైనం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. రైతు రుణమాఫీ నేపథ్యంలో జిల్లాలోని గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈ
రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరుత్సాహమే మిగులుతున్నది. మేడ్చల్ జిల్లాలో అర్హులు సుమారు 20 వేల పైచిలుకు ఉన్నా.. ఇప్పటి వరకు 3,091 మందే లబ్ధి పొందారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అకౌంట్లలో రూ. 17 కోట్లు జ�
జిల్లాలో రుణమాఫీ జాబితా తప్పుల తడకగా మారింది. పలు బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చిన రుణాలు తీసుకున్న రైతుల జాబితాతో రైతులు అటు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్‌లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు.
రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది.
రుణమాఫీ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రెండో విడుతలోనూ అర్హులైన వేలాది మందికి నిరాశే మిగిలింది. రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.
అరకొర రైతు రుణమాఫీ అన్నదాతలను ఆగ్రహానికి గురిచేస్తున్నది. ప్రతి రైతుకు రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించగా వాస్తవంగా అందుకు విరుద్ధంగా ఉన్నది.
మర్రిగూడ పీఏసీఎస్ పరిధిలో 305మంది రైతులు రూ.1.55 కోట్ల పంట రుణం తీసుకున్నారు. మొదటి విడుతలో లక్షలోపు రుణం తీసుకున్న 122మంది రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించగా 67 మందికే మాఫీ అయ్యింది.
ప్రభుత్వం చేపట్టిన పంటరుణమాఫీ క్షేత్ర స్థాయిలో గందరగోళంగా మా రింది. మొదట లక్ష లోపు, ఆ తర్వాత రెండో విడ త లక్షన్నరలోపు మాఫీ చేసినట్లు ప్రకటించడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
రేషన్‌కార్డు లేదని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన యువరైతు గూడ అభినవ్ బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడుత రుణమాఫీపై గందరగోళం నెలకొన్నది. మొదటి విడుత మాదిరిగానే కొంతమంది రైతులకే మాఫీ వర్తించడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నది.