గండీడ్, ఆగస్టు 6 : ‘మీ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బందులు రావొద్దు’ అని డీసీవో పద్మ మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందికి సూచించారు. లోన్ తీసుకోకపోయినా రుణమాఫీ లిస్ట్‌లో పేరు వచ్చిందని ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయంటూ సోమవారం రైతులు ఆందోళన చేయడంతో ‘నమస్తే తెలంగాణ’లో ‘పీఏసీఎస్‌లో ఘరానా మోసం!’ పేరిట కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డీసీవో మంగళవారం గండీడ్ పీఏసీఎస్‌ను సందర్శించారు. రుణమాఫీలో అవకతవకలపై వివరాలు సేకరించారు. రుణమాఫీ లిస్ట్ వెంటనే పంపించాలని, సరిగ్గా పనిచేయకపోతే వేటు తప్పదంటూ హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): ఎరువుల సరఫరాపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ను 15 రోజుల్లో గా పూర్తి చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎరువుల సరఫరాపై ఆడిట్ జరగకపోవడంతో కొందరు ఉద్యోగులు ఎరువుల సొమ్మును నొక్కేస్తున్నారంటూ ‘ఆడిట్ లేదు… అరాచకమే’ శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురించిన నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయాలని చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైనా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.