ఎడపల్లి/వర్ని, మార్చి 1: ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద యోగా పతాంజలి గురువులు ఎక్కోండ ప్రభాకర్, సూర కిరణ్ ఆధ్వర్యంలో, రుద్రూర్లో మహార్షి పతంజలి యజ్ఞ సహిత యోగ ధ్యాన కేంద్రం ఆధ్వ ర్యంలో ఆదివారం మట్టి స్నానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చర్మ సమస్యలు ఉన్నవారికి మట్టి స్నానం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. పుట్ట మట్టిని వన మూలికలతో కలిపి ఒంటికి పూసుకొని ఎండలో 20 నిమిషాలు నిలబడి స్నాన మాచరిస్తే చర్మం నిగారింపు సంతరించుకోవడంతో పాటు చర్మ సమస్యలు పోతాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ విశ్వనాథ్ మహరాజ్, వివిధ మండలాల నుంచి వచ్చిన యోగా సాధకులు పాల్గొన్నారు.