రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా ప్రవహించిన వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన సాయం అందలేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భా రీ వర్షాలు పలు మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల ధాటికి పంటలు కొట్టుకపోగా కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమై, ప్రాణ, ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో సీఎం మంగళవా�
మెదక్ జిల్లా లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షం బీభత్సం సృష్టించగా, సోమవారం ముసురు వాన కురిసింది. దీంతో జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి.
: సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పంటలు, రోడ్లు, ఇండ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పలుచెరువులు, కుంటలకు బుంగలుపడ్డాయి. జిల్లాలోని జలవనరుల్లోకి పె
దుందుభీ వాగులో చేపలవేటకు వెళ్లి నీటిలో చిక్కుకున్న 12 మంది చెంచుల ను నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల రెస్క్యూ టీం రెండు రోజులు శ్రమించి గజ ఈతగాళ్ల సాయంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు.
మణుగూరులో ముంపునకు గురైన వరద బాధితులకు న్యాయం చేయాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు.
ఆస్మా తుఫాన్ కారణంగా జరిగిన వరద విలయానికి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. పంటలు నేలమట్టమైన రైతులు, సర్వం కోల్పో�
నల్లగొండ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పొలాల మీదుగా వరద పొంగి పొర్లడంతో పంటలు మునిగిపోయి తీవ్ర నష్టం వాలిల్లింది. పత్తి చేలల్లో నీళ్లు నిలువడం వల్ల పంట పండు మ
Shadnagar | వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో(Shadnagar) నివసిస్తున్నారు.
‘మిషన్ కాకతీయ’ తెచ్చిన సత్ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తటాకాలు అలుగులు పోస్తున్నాయి.
మెదక్లో శుక్రవారం సాయంత్రం గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపైకి వర్షంనీరు రావడంతో పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తాతోపాటు జేఎన్ రోడ్డు, ఆటోనగర్ రోడ్లు జలమయమయ్